#karanambalaramkrishnamurthy #karanamvenkatesh జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారికి వినతి పత్రం అందజేసిన వేటపాలెం యడ్లబండ్లు యజమానుల సంఘం చీరాల: వేటపాలెం మండలం యడ్లబండ్లుయజమానులు బుధవారం ఉదయం చీరాల పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. వేటపాలెం మండలంలో సుమారు 110 కుటుంబాలు యడ్లబండ్లు మీద జీవనాధారంగా జీవిస్తున్నాయనీ,చీరాల ప్రాంతంలో అపారమైన ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇసుక రీచ్ అనుమతులు లేని కారణంగా యడ్లబండ్లు యజమానులు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి యడ్లబండ్లు ను ఇసుక రవాణాకు మినహాయించిన నిర్ణయాన్ని చీరాల నియోజకవర్గంలో అమలు చేయడానికి పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇసుక రవాణాకు యడ్లబండ్లను మినహాయించడం గత సంవత్సరం ఎమ్మెల్యే బలరాం మాకు జీవనాధారాన్ని కల్పించారని,
అయితే, చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయమై ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు యడ్లబండ్లు యజమానులను అదుపులోకి తీసుకొని ఫెనాల్టీలు విధించడం ద్వారా మాపై ఆదాయానికి మించి భారం పడటం తో మా కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయనీ వారు ఎమ్మెల్యే బలరాం వద్ద వాపోయారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎడ్లబండ్లు యజమానుల లో ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తుంటే సదరు విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వ అధికారులకు మా వంతు సహకారాన్ని అందించడానికి యడ్లబండ్లు యజమానుల సంఘం కృషి చేస్తుందని, సంఘం నాయకులు ఎమ్మెల్యే కి తెలిపారు. వేటపాలెం మండల పరిధిలోని పోలీస్, రెవెన్యూ అధికారులతో మా సమస్యను చర్చించి మాకు జీవనాధారం కల్పించవలసిందిగా యడ్లబండ్లు యజమానులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ, వీలైనంత త్వరగా సంబంధిత అధికారులతో మరియు ఎడ్లబండ్ల యజమానులతో సంయుక్త సమావేశం నిర్వహించి మంచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో యడ్లబండ్లు యజమానులు కుంభా వీరయ్య, ఆతిన వెంకట్రావు, అక్కల కృష్ణారెడ్డి, తమ్మినేని నవీన్ కుమార్, భూపతి వెంకట్రావు, చింతా బాబురావు, బట్టు పెద్ద మస్తాన్, ఓరుగంటి రెడ్డి యువజన సంఘం నాయకులు దుడ్ల రాజేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments