CHIRALA MEDIA News
కీలకమైన వచ్చే ఎన్నికల్లో వారసులను పక్కనపెట్టి సీనియర్ల రంగంలో ఉండాలని చెప్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు మాత్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తండ్రికి వారసుడిగా వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ పోటీ చేసేందుకు అంగీకరించారు. చీరాల రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని వారికి సూచించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని నివాసంలో తొలుత. సీఎంను బాలినేని కలిశారు. వారిద్దరి చర్చల అనంతరం బలరాం, వెంకటేష్ ను పిలిచి మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ను పోటీకి దించేందుకు అంగీకరించాలని, చీరాల నుంచే అవకాశం ఇవ్వాలని బలరాం సీఎంను కోరినట్లు తెలిసింది.
బలరాం వారసుడిగా వెంకటేష్ కొన సాగేందుకు అంగీకరించిన సీఎం.. చీరాలలో యాక్టివ్ గా పనిచేయండి. అని మాత్రం చెప్పినట్లు తెలిసింది. ఇది సాను కూల పరిణామంగా బలరాం ఆనుచర వైసీపీ: శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే చీరాల కాని పక్షంలో బలరాం లేక ఆయన కుమారుడిని.. పర్చూరు కానీ, అద్దంకికి కానీ మార్చే అవకాశం లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం అద్దంకి నాయకులతో సమీక్ష ని నిర్వహించిన జగన్ అక్కడి ఇన్చార్జి చైతన్యను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని స్పష్టంగా కోరా తర్వాత పర్చూరు ఇన్చార్జి మార్పు విషయంలో ప్రస్తుత ఇన్చార్జి రామనాథంబాబు తననే కొనసాగించాలని కోరినప్పుడు వరుసగా మూడు నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం వారినే పోటీకి దించటం కష్టమని స్పష్టంగా చెప్పారు. అంతేగాక పర్చూరు ఇన్చార్జిగా కాపు సామాజికవర్గం వారిని నియమించలని స్వయంగా సీఎం గతంలో చెప్పారు.
ఈ చీరాల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచన బాలినేనితోపాటు సీఎంను కలిసిన బలరాం, ఆయన తనయుడు నేపథ్యంలో ఎమ్మెల్యే బలరాం, ఆయన తన యుడు వెంకటేష్ సీఎంను కలవటం. ఆ సందర్భంగా జగన్ కొన్ని సూచనలు చేయడం. నేతల్లో చర్చనీయాంశమైంది.
పర్చూరుపై జగన్, బాలినేనితొలుత సీఎం జగన్, ఎమ్మెల్యే బాలినేని ఏ. కాంతంగా సమావేశమయ్యారు. ఆ సమ యం లో పర్చూరు ఇన్చార్జి నియామకం విషయ మై చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఎలాంటి నిర్ణ యం తీసుకున్నారన్న విషయం వెల్లడికాక పోవటంతో పర్చూరు వైసీపీ శ్రేణుల్లో అయో మయం నెలకొంది. ఆమంచికే అవకాశం వ స్తుందని అనుచరులు నమ్ముతుండగా, వ్యతిరే కులు బాలినేని సూచించే కొత్త కాపు నాయకు డికి అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.
Comments