CHIRALA MEDIA News కీలకమైన వచ్చే ఎన్నికల్లో వారసులను పక్కనపెట్టి సీనియర్ల రంగంలో ఉండాలని చెప్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు మాత్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తండ్రికి వారసుడిగా వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ పోటీ చేసేందుకు అంగీకరించారు. చీరాల రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని వారికి సూచించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి తోపాటు ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని నివాసంలో తొలుత. సీఎంను బాలినేని కలిశారు. వారిద్దరి చర్చల అనంతరం బలరాం, వెంకటేష్ ను పిలిచి మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ను పోటీకి దించేందుకు అంగీకరించాలని, చీరాల నుంచే అవకాశం ఇవ్వాలని బలరాం సీఎంను కోరినట్లు తెలిసింది. బలరాం వారసుడిగా వెంకటేష్ కొన సాగేందుకు అంగీకరించిన సీఎం.. చీరాలలో యాక్టివ్ గా పనిచేయండి. అని మాత్రం చెప్పినట్లు తెలిసింది. ఇది సాను కూల పరిణామంగా బలరాం ఆనుచర వైసీపీ: శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే చీరాల కాని పక్షంలో బలరాం ల...
Comments